Bathukamma Bathukamma uyyalo

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…     బంగారు బతుకమ్మ ఉయ్యాలో… ||2|| 
ఆనాటి కాలాన ఉయ్యాలో…               దర్మాంగుడను రాజు ఉయ్యాలో… 
ఆ రాజు భార్యయు ఉయ్యాలో..            అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో…
నూరు నోములు నోమి ఉయ్యాలో…     నూరు మందిని కాంచె ఉయ్యాలో… 
వారు సూరులై ఉయ్యాలో…               వైరులచే హతమయిరి ఉయ్యాలో… 
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో…           తరగని సోకమున ఉయ్యాలో… 
ధన ధాన్యములను బాసి ఉయ్యాలో … దాయదులను బాసి ఉయ్యాలో… 
వనితతో ఆ రాజు ఉయ్యాలో…            వనమందు నివసించే ఉయ్యాలో… 
కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో…        ఘనత పొందిరింక ఉయ్యాలో… 
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో…             పలికి వరమడమనే ఉయ్యాలో… 
వినిపించి వెడదిని ఉయ్యాలో…          వెలది తన గర్భమున ఉయ్యాలో..
పుట్టమని వేడగా ఉయ్యాలో…            పూబోణి మది మెచ్చి ఉయ్యాలో… 
సత్యవతి గర్భమున ఉయ్యాలో…        జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో… 
అంతలో మునులును ఉయ్యాలో…      అక్కడికి వచ్చిరి ఉయ్యాలో.. 
కపిల గాలిలా ఉయ్యాలో…                  కష్యపాంగ ఋషులు ఉయ్యాలో.. 
అత్రి వశిష్టులు ఉయ్యాలో…                ఆగండ్రి నను చూచి ఉయ్యాలో.. 
బతుకనీయ తల్లి ఉయ్యాలో…             బతుకమ్మ ననిరంత ఉయ్యాలో.. 
పిలువుగా అతివలు ఉయ్యాలో…         ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో.. 
బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో…     ప్రజలంత అందురు ఉయ్యాలో…
తానూ ధన్యుడంటూ ఉయ్యాలో…        తన బిడ్డతో రాజు ఉయ్యాలో… 
నిజ పట్నముకేగే ఉయ్యాలో…            నేల పాలించగా ఉయ్యాలో… 
శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో…           చక్రాంగుడను పేరు ఉయ్యాలో…
రాజు వేషమున ఉయ్యాలో…               రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో… 
ఈ ఇంట మనియందు ఉయ్యాలో…      ఎతగా బతుకమ్మను ఉయ్యాలో… 
పెండ్లాడి కొడుకును ఉయ్యాలో…          పెక్కు మందిని కాంచె ఉయ్యాలో… 
ఆరు వేల మంది ఉయ్యాలో…              అతి సుందరాంగులు ఉయ్యాలో… 
ధర్మంగుడను రాజు ఉయ్యాలో…          తన భార్య సత్యవతి ఉయ్యాలో… 
సరిలేని గరిమతో ఉయ్యాలో…              సంతోషమొందిరి ఉయ్యాలో.. 
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో…           శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో… 
జగతిపపై బతుకమ్మ ఉయ్యాలో…         శాస్వతమ్ముగా ఉయ్యాలో… 
ఏ పాట పడినను ఉయ్యాలో…              ఏ పాట విన్నను ఉయ్యాలో… 
సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో…          శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో… 
సిరి సంపదలిచ్చు ఉయ్యాలో…               శ్రీ లక్ష్మీ దేవి ఉయ్యాలో… 
ఘనమైన కీర్తిని ఉయ్యాలో…                 శ్రీ వాణి కొసగును ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…      బంగారు  బతుకమ్మ ఉయ్యాలో… ||4||
Bathukamma Bathukamma uyyalo Bathukamma Bathukamma uyyalo Reviewed by Unknown on 12:23 AM Rating: 5

No comments:

Powered by Blogger.